Asianet News TeluguAsianet News Telugu

ఎల్ఆర్ఎస్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు  ఆర్జీదారులను ఇబ్బంది పెట్టొద్దని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Telangana High court key orders on LRS lns
Author
Hyderabad, First Published Jan 20, 2021, 2:43 PM IST

హైదరాబాద్: ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు  ఆర్జీదారులను ఇబ్బంది పెట్టొద్దని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై బుధవారం నాడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.  ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ జరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం 2016 లో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ను తీసుకొచ్చింది. ఈ విషయమై అప్పట్లో ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్  కూడా కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ ఇంకా సాగుతోంది.

గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను తీసుకొచ్చింది. భూముల క్రమబద్దీకరణ కోసం అవకాశం ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ ఫీజుల విషయంలో  విపక్షాల నుండి పెద్ద ఎత్తున  విమర్శలు రావడంతో  ఎల్ఆర్ఎస్ పీజును తగ్గించింది.

ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను తొలుత నిలిపివేసిన ప్రభుత్వం గత ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత  ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చింది.

ఎల్ఆర్ఎస్ విషయంలో  బుధవారం నాడు విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.

ఎల్ఆర్ఎస్  పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తమకు, పిటిషనర్లకు సమర్పించాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది.సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఎల్ఆర్ఎస్ పై విచారణ చేపడుతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios