Asianet News TeluguAsianet News Telugu

విద్యార్ధుల జీవితాలను ఫణంగా పెట్టొద్దు: ఫైర్ సేఫ్టీపై కాలేజీలకు హైకోర్టు సూచన

ఫైర్ సేఫ్టీ పాటించని కాలేజీలపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ విషయమై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

Telangana High court key comments on fire safety in colleges lns
Author
Hyderabad, First Published Feb 25, 2021, 4:14 PM IST


హైదరాబాద్: ఫైర్ సేఫ్టీ పాటించని కాలేజీలపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ విషయమై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.కాలేజీల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల విషయమై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు విచారించింది.

ఫైర్ సేఫ్టీ నిబంధనలపై కాలేజీల పిటిషన్లపై కోర్టు విచారణచట్టానికి ముందు నిర్మించిన భవనాలకు అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ నిబంధనలను పరిశీలించాలని కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును కోరాయి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని 70 కాలేజీలపై చర్యలు తీసుకొన్న విషయాన్ని ఇంటర్ బోర్డు హైకోర్టుకు వివరించింది.

హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఇప్పుడే నిద్ర లేచిందన్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాలేజీలు అగ్నిమాపక నిబంధనలు పాటించాల్సిందేనన్న హైకోర్టు తేల్చి చెప్పింది. విద్యార్ధుల జీవితాలను ఫణంగా పెట్టొద్దని హైకోర్టు కోరింది. 

నిబంధనలు అనుగుణంగా లేని భవనాల్లో కాలేజీలు ఎలా కొనసాగిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఇలా నిర్వహించడం వల్ల విద్యార్ధులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది.కొన్ని కాలేజీలు లాభాల కోసమే నడుపుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాలేజీల వాదనలు ఏ మాత్రం సహేతుకంగా లేవని హైకోర్టు తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios