బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర: మరో బెంచీకి పిటిషన్ బదిలీ

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర విషయమై దాఖలు చేసిన పిటిషన్ ను మరో బెంచీకి బదిలీ అయింది. జస్టిస్ లలితకుమార్ సెలవు పెట్టడంతో జస్టిస్ వినోద్ కుమార్ బెంచీ ఈ పిటిషన్ ను విచారించనుంది. 

Telangana high Court Justice Vinod kumar Bench To Hear Bandi Sanjay praja Sangrama yatra Petition

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్  ప్రజా సంగ్రామ యాత్ర  విషయమై హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను జస్టిస్ వినోద్ కుమార్  బెంచీ ఇవాళ మధ్యాహ్నం విచారణ చేయనుంది.

ప్రజా సంగ్రామ యాత్రపై వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన ,నోటీసును సవాల్ చేస్తూ బీజేపీ నేతలు ఈ నెల 23న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై నిన్న హైకోర్టు విచారణ చేసింది. ఈ విచారణను ఇవాళ ఉదయానికి వాయిదా వేసింది. అయితే ఈ పిటిషన్ ను విచారణ చేసిన జస్టిస్ లలితకుమారి సెలవులో ఉండడంతో ఈ పిటిషన్ ను జస్టిస్ వినోద్ కుమార్ బెంచీకి మారింది. ఈ పిటిషన్ ను ఇవాళ మధ్యాహ్నం జస్టిస్ వినోద్ కుమార్ బెంచీ విచారణ చేయనుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విషయమై ఆందోళన చేసిన బీజేపీ శ్రేణులపై  హైద్రాబాద్ పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పాదయాత్ర లో బస చేసిన చోటునే బండి సంజయ్ దీక్షకు ప్రయత్నించాడు. దీంతో ’ నెల 23న బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ లోని ఆయన ఇంటికి తరలించారు.  ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న  ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు. 

ఈ నోటీసులపై బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ పై హైకోర్టు ఏ రకమైన ఆదేశాలు జారీ చేస్తుందో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 2వ తేదీన యాదాద్రిలో బండి సంజయ్  మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు.  ఈ నెల 27వ తేదీన భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద యాత్ర ముగియనుంది.ఈ యాత్ర ముగింపును పురస్కరించుకొని  వరంగల్ లో బీజేపీ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసింది.ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటారు. అయితే ఈ సభను యధావిధిగా నిర్వహిస్తామని కూడా బీజేపీ ప్రకటించింది. అయితే ప్రజా సంగ్రామ యాత్ర విషయమై కోర్టు ఆదేశాలపై ఆదారపడి ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios