తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సింగరేణి కాలనీలో (singareni colony rape case) చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో (telangana high court) విచారణ జరిగింది. రాజును పోలీసులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పౌరహక్కుల సంఘం పిటిషన్ వేసింది

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సింగరేణి కాలనీలో (singareni colony rape case) చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో (telangana high court) విచారణ జరిగింది. రాజును పోలీసులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పౌరహక్కుల సంఘం పిటిషన్ వేసింది. దీనికి సంబంధించి నివేదికను కోర్టుకు సమర్పించారు మేజిస్ట్రేట్. ఈ నివేదికలో పోలీసులు రాజును హత్య చేసినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీంతో పిల్‌పై విచారణను ముగించింది తెలంగాణ హైకోర్టు. 

కాగా.. సింగరేణి మైనర్ బాలిక పై రేప్  చేసి హత్య చేసిన నిందితుడు రాజు (raju) అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన సంగతి తెలిసిందే. జనగామ  జిల్లా స్టేన్‌ఘన్‌పూర్ రైల్వేట్రాక్ పై ఓ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ఈ డెడ్‌బాడీ ఉన్న చేయిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతుడు రాజుగా స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహం చేయిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉంది.దాని ఆధారంగా పోలీసులు శవం రాజుదిగా గుర్తించారు. 

ALso Read:సైదాబాద్ మైనర్ బాలికపై రేప్, హత్య: నిందితుడు రాజు ఆత్మహత్య, రైల్వే ట్రాక్ పై శవం

అనంతరం రాజు కోసం దాదాపు వేయి మంది పోలీసులు గాలింపు చేపట్టారు. వారం రోజుల పాటు రాజు కోసం గాలించిన పోలీసులు చివరకు అతని మృతదేహాన్ని కనిపెట్టారు. రాజు ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన రాజు నాగోల్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉప్పల్ వెళ్లాడు. అక్కడి వరకు సిసీటీవీ ఫుటేజీల ద్వారా అతని కదలికలను పోలీసులు గుర్తించారు. 

ఈ ఏడాది వినాయకచవితి రోజున చిప్స్ ప్యాకెట్ ఇస్తానని నమ్మించి ఆరేళ్ల బాలికపై నిందితుడు రాజు అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై  కుటుంబసభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితులపై లాఠీచార్జీ చేసి చిన్నారి మృతదేహన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.  బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 8 గంటల  ఆందోళన తర్వాత  స్థానికులు ఆందోళనను విరమించారు.