Asianet News TeluguAsianet News Telugu

గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌లో వ్యాపారాలకు గ్రీన్ సిగ్నల్: ఈ నెల 18 వరకు హైకోర్టు అనుమతి

గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో ఈ నెల 18వ తేదీ వరకు వ్యాపారాలు నిర్వహించుకొనేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 4వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు 18వ తేదీ వరకు  వ్యాపారాలకు అవకాశం కల్పించింది.

Telangana high court green signals for Gaddi annaram fruit market
Author
Hyderabad, First Published Oct 4, 2021, 5:01 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్ (hyderabad) గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో (gaddiannaram fruit market) ఈ నెల 18వ తేదీ వరకు వ్యాపారాలు చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు9telangana high court) అనుమతి ఇచ్చింది.హైద్రాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను బాట సింగారం  (bata singaaram)గ్రామ పరిధిలోకి మార్చాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కమీషన్, వ్యాపారుల అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

also read:గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌పై ఈ నెల 4 వరకు యథాతథస్థితి: తెలంగాణ హైకోర్టు

 ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు యథాతథస్థితిని  ఈ నెల 4వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఇవాళ మరోసారి ఇదే విషయమై హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ నెల 18వ తేదీ వరకు గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది.హైద్రాబాద్ నగరానికి సమీపంలోని బాట సింగారం అన్ని రకాల సదుపాయాలను కల్పించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios