రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే   ఇతర రాష్ట్రాల రోగులను అనుమతిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ పై  హైకోర్టు  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 

హైదరాబాద్: రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే ఇతర రాష్ట్రాల రోగులను అనుమతిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ పై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేసిన గైడ్‌లైన్స్ ను సవాల్ చేస్తూ మాజీ ఐఆర్ఎష్ అధికారి వెంకట కృష్ణారావు శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. 

also read:ఏ రాష్ట్రం వారైనా తెలంగాణకు రావొచ్చు.. కానీ : డీహెచ్ శ్రీనివాసరావు క్లారిటీ

ఇతర రాష్ట్రాల రోగులను సరిహద్దుల్లో ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించింది. తెలంగాణకు నాలుగు రాష్ట్రాలతో సరిహద్దులున్నాయని ఏజీ హైకోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ పౌరుల బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ పై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగాన్ని మీరే మారుస్తారా అని ప్రశ్నించింది.దేశంలో ఇలాంటి సర్క్యులర్ ఎక్కడా చూడలేదని హైకోర్టు అభిప్రాయపడింది. సరిహద్దుల్లో వైద్యం అందక రోగులు మరణిస్తున్నారని హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. 

దేశంలో ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేసుకొనే హక్కును ప్రజలకు రాజ్యాంగం కల్పించిందని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. అంబులెన్స్ లను ఆపొద్దని ఎలా ఆదేశాలు ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగం కంటే మీ సర్క్యులర్ గొప్పదా అని కూడ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ సమయంలో మహారాష్ట్రలో కూడ ఇదే తరహాలో సర్క్యులర్ జారీ చేసిన విషయాన్ని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం రాష్ట్రాలకు కల్పించిన అధికారాల మేరకే తాము ఈ సర్క్యులర్ జారీ చేసినట్టుగా ఏజీ కోర్టుకు తెలిపారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘించడం లేదని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రుల్లో ఆడ్మిషన్ లేకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులను రాకూడదనే ఉద్దేవ్యంతోనే ఈ సర్క్యులర్ జారీ చేసినట్టుగా చెప్పారు.జీవించే హక్కును కాదనడానికి మీకు ఏ అధికారం ఉందని హైకోర్టు ప్రశ్నించింది. అడ్వకేట్ జనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు.