Asianet News TeluguAsianet News Telugu

ఓటుకు నోటు కేసు: సండ్రకు హైకోర్టులో చుక్కెదురు

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఓటుకు నోటు కేసు నుంచి సండ్రను తొలగించేందుకు నిరాకరించింది హైకోర్టు.

telangana high court dismissed the discharge petition of mla sandra venkata veeraiah in vote for note case ksp
Author
Hyderabad, First Published Dec 8, 2020, 9:13 PM IST

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఓటుకు నోటు కేసు నుంచి సండ్రను తొలగించేందుకు నిరాకరించింది హైకోర్టు. ఆ కేసులో సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది .

ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా గైర్హాజరు కాగా... ఈనెల 15వ తేదీన వీరంతా తప్పనిసరిగా హాజరు కావాలని నిందితులందరినీ ఆదేశించింది ఏసీబీ కోర్టు. హాజరు మినహాయింపు కోరుతూ దాఖలయ్యే పిటిషన్లను అనుమతించమని కోర్టు స్పష్టం చేసింది. 

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫన్‌‌సన్ ‌ను ప్రలోభాలకు గురి చేసిన ఆరోపణలపై అప్పటి టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహాలపై ఏసీబీ కోర్టు కేసు నమోదు చేసింది.

స్టీఫన్ సన్‌కు రేవంత్ రెడ్డి 50 లక్షల నగదును ఇస్తున్న వీడియోలు సైతం అప్పట్లో కలకలం సృష్టించాయి. అంతేకాకుండా, స్టీఫన్ సన్ తో పలువురు టీడీపీ నేతలు మాట్లాడిన ఆడియోలు సైతం అప్పట్లో వెలుగు చూశాయి. కాగా ఇదే కేసులో ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి జైలుకెళ్లాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios