ఐఎఎస్ స్మితా సభర్వాల్‌కి తెలంగాణ హైకోర్టు షాక్: పరువు నష్టం కేసులో రూ. 15 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశం
ఫ్యాషన్ షో లో పాల్గొనడం అధికారిక విధులు ఎలా అవుతుందని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. అవుట్ లుక్ పత్రిక ప్రచురించిన కథనంపై ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకి సంబంధించి ప్రభుత్వం చెల్లించిన రూ. 15 లక్షలను తిరిగి ఇవ్వాలని సభర్వాల్ కి హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: అవుట్ లుక్ పత్రికపై దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించిన చెల్లించిన రూ. 15 లక్షలను తిరిగి చెల్లించాలలని ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ కి Telangana High Court ఆదేశించింది.
ఐఎఎస్ అధికారి Smitha Sabharwal భర్తతో ఫ్యాషన్ షో కి హాజరైంది.ఈ విషయమై అవుట్ లుక్ పత్రిక కథనాన్ని గతంలో ప్రచురించింది. ఈ కథనం తన పరువుకు భంగం కల్గించేలా ఉందని స్మితా సభర్వాల్ Out Look పత్రికపై పరువు నష్టం దావాను దాఖలు చేసింది. 2015లో Hyderabad లో ని ఓ హోటల్ లో జరిగిన ఫ్యాషన్ షోలో స్మితా సభర్వాల్ భర్తతో కలిసి ఫ్యాషన్ షో లో పాల్గొంది. నో బోరింగ్ బాబు అనే పేరుతో అవుట్ లుక్ కథనం ప్రచురించింది. ఈ కథనంలో సీఎం KCR పై కూడా వ్యాఖ్యలున్నాయి. ఈ కథనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్మితా సభర్వాల్ అవుట్ లుక్ పత్రికపై రూ. 10 కోట్ల Defamation Case దావా వేసింది. అయితే దీని కోసం కోర్టు ఫీజుల కింద రూ. 9.75 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. దీంతో పరువు నష్టం కేసు దాఖలు చేసేందుకు స్మితా సభర్వాల్ కి తెలంగాణ ప్రభుత్వం రూ.15 లక్షలను మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.
ఈ జీవోను వి. విద్యాసాగర్, కె.ఈశ్వర్ రావు, అవుట్ లుక్ పత్రిక యాజమాన్యం వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ ల ధర్మాసనం విచారణ చేసింది.
ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ భర్తతో కలిసి ఫ్యాషన్ షోకి హాజరు కావడం అధికార విధుల్లో భాగం కాదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. అవుట్ లుక్ పత్రికపై పరువు నష్టం దావా వేయడం ప్రజా ప్రయోజనం కిందకు రాదని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ పరువు నష్టం కింద ప్రభుత్వం చెల్లించిన రూ. 15 లక్షలను తిరిగి ఇవ్వాలని స్మితా సభర్వాల్ ని కోర్టు ఆదేశించింది. లేకపోతే 30 రోజుల్లో ఈ మొత్తాన్ని వసూలు చేసి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది హైకోర్టు.