Asianet News TeluguAsianet News Telugu

నోటీసులివ్వాలి: దేవరయంజాల్ భూములపై ఐఎఎస్‌ల కమిటీ జీవో రద్దుకి తెలంగాణ హైకోర్టు నో

దేవరయంజాల్ భూముల అవకతవకలపై విచారణ జరిపేందుకు జారీ చేసిన 1014 జీవోను రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
 

Telangana High court denies to cancel G.O. 1014 on Devaryamjal lands lns
Author
Hyderabad, First Published Jun 17, 2021, 12:33 PM IST

హైదరాబాద్:  దేవరయంజాల్ భూముల అవకతవకలపై విచారణ జరిపేందుకు జారీ చేసిన 1014 జీవోను రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.దేవరయంజాల్ దేవాలయ భూముల  ఆక్రమణలపై విచారణ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐఎఎస్ లతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 1014 జివోను కొట్టివేయాలని సదాకేశవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది. జీవో 1014 అమలు నిలిపివేసేందుకు  హైకోర్టు నిరాకరించింది. 

 

also read:దేవరయంజాల్‌ భూముల నుండి ఎవరిని ఖాళీ చేయించొద్దు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఆలయ భూములు గుర్తించేందుకు విచారిస్తే ఇబ్బంది ఏమటన్న హైకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. దేవరయాంజల్ భూముల్లో విచారణ జరిపే స్వేచ్ఛ కమిటీకి ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే  అధికారులు విచారణకు వస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  అయితే భూముల్లో విచారణకు వెళ్లే ముందు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.  విచారణ సమయంలో పిటిషనర్లు సహకరించకపోతే చర్యలు తీసుకోవచ్చని  హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. మరో వైపు ఐఎఎస్ ల కమిటీకి అవసరమైన దస్త్రాలు, సమాచారం ఇవ్వాలని పిటిషనర్లకు సూచించింది హైకోర్టు.

 

Follow Us:
Download App:
  • android
  • ios