బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర: విచారణను రేపటికి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
ప్రజా సంగ్రామ యాత్రపై బీజేపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది.
హైదరాబాద్: ప్రజా సంగ్రామ యాత్రపై బీజేపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను రేపు విచారిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.
ప్రజా సంగ్రామ యాత్రనునిలిపివేయాలని వర్ధన్నపేట ఏసీపీ నిన్న నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్ర విషయమై బీజేపీ నేతలు తెలంగాణ హైకోర్టులో ఈ నెల 23న సాయంత్రం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై రేపు ఉదయం విచారణ చేస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. రేపు ఉదయమే ఈ పిటిషన్ ను మొదటే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.
also read:27న షెడ్యూల్ ప్రకారమే యాత్ర ముగింపు సభ: ఇంటి దగ్గరే బండి సంజయ్ నిరసన దీక్ష
26 రోజుల యాత్రలో 22 రోజుల పాటు యాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేని విషయాన్ని బీజేపీ తరపున న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ విద్వేషపూరితంగా ప్రసంగాలు చేస్తున్నారని ప్రభుత్వ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల నమోదైన కేసులను కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ప్రభుత్వ వాదనను బీజేపీ తరపు న్యాయవాది తోసిపుచ్చారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా యాత్రను నిలిపివేయడం సరైంది కాదని బీజేపీ తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో ఈ పిటిషన్ పై రేపు ఉదయమే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.
బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులను నిరసిస్తూ ప్రజా సంగ్రామ యాత్ర స్థలంలోనే నిన్న దీక్షకు బండి సంజయ్ ప్రయత్నించారు. దీంతో పోలీసులు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ కు తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని కోరుతూ బండి సంజయ్ కు పోలీసులు నోటీసులు పంపడంతో తెలంగాణ హైకోర్టును బీజేపీ నేతలు ఆశ్రయించారు.
ప్రజా సంగ్రామ యాత్ర విషయమై తెలంగాణ హైకోర్టు రేపు ఏ రకమైన తీర్పును ఇవ్వనుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నెల 2వ తేదీన యాదాద్రిలో ప్రజా సంగ్రామ యాత్రను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు.ఈ నెల 27న వరంగల్ లో ముగియాల్సి ఉంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.