తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా ఎంపీపీ చుట్టూ ఆయన పూనకంతో ఊగిపోతూ ప్రదిక్షిణలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ (telangana health director) శ్రీనివాసరావు (srinivasa rao) వివాదంలో చిక్కుకున్నారు. దేవుడు కరుణించాలంటూ ఖమ్మంలో వింత పూజలు నిర్వహించారు. మంటల్లో మిరపకాయలు వేస్తూ పూజలు చేశారు. తనకు తాను దేవతగా ప్రకటించుకున్న మహిళా ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. హెల్త్ డైరెక్టర్‌గా వున్న ఒక వ్యక్తి పూనకం వచ్చినట్లు ప్రదక్షిణలు చేయడం కలకలం రేపుతోంది. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.