Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఉధృతి: కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  ఆన్‌లైన్ లోనే కేసులను విచారించాలని  హైకోర్టు నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కోర్టులకు ఉత్తర్వులను పంపింది.

Telangana HC to conduct hearing of cases virtually with immediate effect lns
Author
Hyderabad, First Published Apr 30, 2021, 11:38 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  ఆన్‌లైన్ లోనే కేసులను విచారించాలని  హైకోర్టు నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కోర్టులకు ఉత్తర్వులను పంపింది.రాష్ట్రంలో కరోనా కేసులు ఐదు వేలకుపైగా నమోదౌతున్నాయి. భౌతికంగా కేసు విచారణ నిర్వహిస్తే  కరోనా కేసులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భావించిన ఉన్నత న్యాయస్థానం ఆన్‌లైన్ లోనే  కేసుల విచారణను చేపట్టాలని నిర్ణయం తీసుకొంది. 

also read:తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి: మొత్తం 4,35,606కి చేరిక

గత ఏడాది కూడ కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంంలో ఆన్‌లైన్ లోనే  రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో కేసుల విచారణ సాగింది. ఆన్‌లైన్ ద్వారా కేసుల విచారణను  నిర్వహించడం వల్ల కరోనా కేసుల వ్యాప్తికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని  ఉన్నత న్యాయస్థానం అభిప్రాయంతో ఉంది. రాష్ట్రంలో కరోనా కేసుల విషయమై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ హైకోర్టు  తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios