Telangana HC: తెలంగాణ హైకోర్టులో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల విద్యాహర్హతలు, ఇరత విషయాలు ఇలా ఉన్నాయి...
Telangana HC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ హైకోర్టులోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు తాజాగా వెలువడ్డాయి. జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీస్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాల ప్రకారం.. అభ్యర్థులు పోస్టులకు అర్హత పొందాలంటే భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. విద్యార్హతతో పాటు, అభ్యర్థులు తప్పనిసరిగా భాషాపరమైన అర్హతలను కూడా కలిగి ఉండాలి.. అంటే వారు ఉద్యోగం చేయాబోయే (విధుల్లో ఉండే) జిల్లా భాషపై వారికి అవగాహన ఉండాలి. వారికి కంప్యూటర్ ఆపరేషన్‌పై కూడా పరిజ్ఞానం ఉండాలి.
ఈ పోస్టులు భర్తీకి సంబంధించిన వయస్సు వివరాలు..
అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా జూలై 1, 2022 నాటికి 18 మరియు 34 సంవత్సరాల మధ్య ఉండాలి. SC, ST, BC మరియు EWS వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. శారీరక వైకల్యం ఉన్న అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలించింది.
ఎలా దరఖాస్తు చేయాలి..
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ (https://tshc.gov.in/getRecruitDetails) మరియు రాష్ట్రంలోని అన్ని జిల్లాల వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచబడింది. ఇది ఏప్రిల్ 4, 2022 రాత్రి 11:59 వరకు అన్‌లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు..
దరఖాస్తు రుసుం OC మరియు BC అభ్యర్థులకు రూ.800 గా ఉంది. అయితే, SC, ST మరియు EWS కేటగిరీల విద్యార్థులు రూ. 400 గా నిర్ణయించారు. ఫీజు అప్లికేషన్ సర్వీస్ ఛార్జీలు మినహాయించబడుతుంది.
అభ్యర్థుల ఎంపిక ఇలా..
రిక్రూట్‌మెంట్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు మౌఖిక ఇంటర్వ్యూ అనే రెండు రౌండ్లు ఉంటాయి. అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హత సాధిస్తేనే వారికి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఇందులో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోప్రశ్నకు ఒక్కోమార్కు చొప్పున మొత్తం 80 మార్కులు కేటాయించారు. 80 ప్రశ్నల్లో 40 జనరల్ నాలెడ్జ్ నుంచి, మరో 40 సాధారణ ఇంగ్లిష్‌కు సంబంధించినవి ఉంటాయి.
కనీస మార్కులు..
ఇంటర్వ్యూకి కనీస అర్హత మార్కులు OC మరియు EWS వర్గాల విద్యార్థులకు 40 శాతం కాగా, BC విద్యార్థులు 35 శాతం స్కోర్ చేయాలి. SC, ST మరియు PH అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించడానికి కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. మొత్తం 173 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను (https://tshc.gov.in/documents/reccell_14_2022_03_03_16_06_11.pdf) చూడవచ్చు.
