తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒకేసారి 60 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. వీరిలో పలు జిల్లాల ఎస్పీలు, కమీషనర్లు వున్నారు.

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒకేసారి 60 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఎస్పీ నుంచి ఐజీ స్థాయి అధికారుల బదిలీలు జరిగాయి. వీరిలో పలు జిల్లాల ఎస్పీలు, కమీషనర్లు వున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనరేట్ల పరిధిలో మెజార్టీ డీసీపీలు బదిలీ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటి వరకు వెయిటింగ్‌లో వున్న ఐపీఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. నల్గొండ, వనపర్తి, సిరిసిల్ల, మహబూబ్ నగర్ ఎస్పీలు , రామగుండం, కరీంనగర్ సీపీలు బదిలీ అయ్యారు. ఒకే చోట పనిచేస్తున్న వారినే ఎక్కువగా ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.