Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ.. స్మితా సభర్వాల్‌కు కీలక బాధ్యతలు

రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన అధికారులను రేవంత్ సర్కార్ మారుస్తూ వస్తోంది. తాజాగా బుధవారం తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Telangana Govt transfers 26 IAS officers in reshuffle ksp
Author
First Published Jan 3, 2024, 5:31 PM IST

రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన అధికారులను రేవంత్ సర్కార్ మారుస్తూ వస్తోంది. తాజాగా బుధవారం తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ హయాంలో సీఎంవోలో కీలక అధికారిగా పనిచేసిన స్మితా సభర్వాల్ కూడా ఈ లిస్టులో వున్నారు. ఈమెకు రేవంత్ రెడ్డి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారోనని గత కొద్దిరోజులుగా ఉత్కంఠ నెలకొనగా.. ఇవాళ్టీతో దానికి తెరపడింది. స్టేట్ ఫైనాన్స్ కమీషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్‌ను నియమించింది.

బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు వీరే :

  • నీటిపారుదలశాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా
  • ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్‌
  • పురావస్తుశాఖ డైరెక్టర్‌గా భారతి హోళికేరి
  • గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్‌ దత్‌ ఎక్కా
  • పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి
  • కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య
  • పీసీబీ సభ్య కార్యదర్శిగా బుద్ధప్రకాశ్‌
  • మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎ.ఎం.ఖానమ్‌
  • టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీగా ఆర్‌.వి.కర్ణన్‌
  • సీఎంవో జాయింట్‌ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ
  • ఫైనాన్స్‌, ప్లానింగ్‌ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణభాస్కర్‌
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కె.శశాంక
  • నల్గొండ కలెక్టర్‌గా హరిచందన
  • జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా బి.ఎం.సంతోష్‌
  • మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా అద్వైత్‌ కుమార్‌ సింగ్‌
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా  వల్లూరు క్రాంతి
  • ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్‌ నజీద్‌
  • బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం
  • జీఏడీ కార్యదర్శిగా ఎం.రఘునందన్‌రావు
  • పంచాయతీరాజ్‌, ఆర్‌డీ కార్యదర్శిగా  సందీప్‌ సుల్తానియా
  • ఆయుష్‌ డైరెక్టర్‌గా ఎం.ప్రశాంతి
     
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios