Asianet News TeluguAsianet News Telugu

కరోనా విజృంభణ: తెలంగాణ సచివాలయంలో సందర్శకులపై ఆంక్షలు

తెలంగాణ సచివాలయంలో కోవిడ్ ఆంక్షలు అమలవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో సర్క్యూలర్ జారీ చేసింది ప్రభుత్వం. విజిటర్స్ సచివాలయంలోకి రాకుండా ఆంక్షలు విధించింది. తాత్కాలిక పాస్‌ల అనుమతిని నిలిపివేసింది. 
 

Telangana govt tightens restrictions in secretariat over Covid 19 ksp
Author
Hyderabad, First Published Apr 23, 2021, 3:30 PM IST

తెలంగాణ సచివాలయంలో కోవిడ్ ఆంక్షలు అమలవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో సర్క్యూలర్ జారీ చేసింది ప్రభుత్వం. విజిటర్స్ సచివాలయంలోకి రాకుండా ఆంక్షలు విధించింది. తాత్కాలిక పాస్‌ల అనుమతిని నిలిపివేసింది. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో  కొత్తగా 6,206 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,79,494కి కేసులు చేరుకొన్నాయి. గత 24 గంటల వ్యవధిలో  1,05,602 మందికి పరీక్షలు నిర్వహిస్తే  6,206 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది.  కరోనా సోకిన 29 మంది 24 గంటల వ్యవధిలో మరణించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా  సోకిన వారిలో 3,052 మంది కోలుకొన్నారు.  రాష్ట్రంలో 52,726 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.  జీహెచ్ఎంసీ పరిధిలో 1,05 కేసులు రికార్డయ్యాయి.తెలంగాణలో నానాటికీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా తెలంగాణలో ఒక్క రోజులో 6,209 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనాతో తాజాగా 24 గంటల్లో 29 మంది మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య రాష్ట్రంలో 3.97 లక్షలకు చేరుకుంది.  

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకుగాను రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను కూడ ప్రభుత్వం అమలు చేస్తోంది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగితే రూ. 1000 జరిమానా విధిస్తున్నారు. నైట్ కర్ప్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది. 

Also Read:తెలంగాణలో ఆగని కరోనా ఉధృతి: ఒక్క రోజులోనే 6 వేలు దాటిన కేసులు, 29 మంది మృతి

ఇదిలావుంటే, మరో 15 రోజుల పాటు తనను ఎవరూ కలవవద్దని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ మాత్రమే చేయాలని ఆయన సూచించారు. తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన ఆ ప్రకటన చేశారు.

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీ రామారావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తనకు కోవిడ్ కు సంబంధించిన స్వల్ప లక్షణాలు ఉన్నట్లు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. 

ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసివాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్ కు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆయన వెంట ఉన్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ కు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios