Asianet News TeluguAsianet News Telugu

లీజు తీసుకుని బకాయిల కుప్ప... ప్రైవేట్ సంస్థలపై తెలంగాణ సర్కార్ కన్నెర్ర

లీజుకు తీసుకుని డబ్బులు కట్టకుండా తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి కొన్ని ప్రైవేట్ సంస్థలు. ఇలాంటి సంస్థల నుంచి వెంటనే బకాయిలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. లీజు కట్టని , రెవెన్యూ షేర్ ఇవ్వని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే లీజు రద్దు చేసేందుకు వెనకాడొద్దని సర్కార్ ఆదేశాలిచ్చింది

telangana govt serious on private companies over lease issue
Author
Hyderabad, First Published Jan 20, 2022, 8:21 PM IST

లీజుకు తీసుకుని డబ్బులు కట్టకుండా తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి కొన్ని ప్రైవేట్ సంస్థలు. ఇలాంటి సంస్థల నుంచి వెంటనే బకాయిలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. లీజు కట్టని , రెవెన్యూ షేర్ ఇవ్వని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే లీజు రద్దు చేసేందుకు వెనకాడొద్దని సర్కార్ ఆదేశాలిచ్చింది. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ 27.45 కోట్లు, జలవిహార్ రూ.6.51 కోట్లు, స్నో వరల్డ్ రూ.15.01 కోట్లు, ఎక్స్‌పో టెల్ హోటల్ రూ.15.13 కోట్లు, ప్రజయ్ ఇండియా సిండికేట్ రూ.5.58 కోట్లు, ట్రైడెంట్ హోటల్ రూ.75.05 కోట్లు చెల్లించాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios