Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో భారీగా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి.. వివరాలు ఇవే..

తెలంగాణ వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను సర్కార్ వేగవంతం చేస్తోంది. తాజాగా వైద్యారోగ్య శాఖలో భారీగా పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Telangana govt sanctions 3897 posts in 9 government medical colleges
Author
First Published Dec 1, 2022, 3:12 PM IST

తెలంగాణ వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను సర్కార్ వేగవంతం చేస్తోంది. ఇటీవలే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వైద్యారోగ్య శాఖలో భారీగా పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద  9 మెడికల్ కాలేజీలు, అనుబంధ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో 3,897 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 

రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్‌లోని 9 కొత్త మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో ఒక్కో కాలేజీకి 433 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించడానికి సీఎం కేసీఆర్ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణకు బిగ్ బూస్ట్ లభించిందని హరీష్‌ రావు పేర్కొన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios