Asianet News TeluguAsianet News Telugu

దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైన తెలంగాణ.. 21 రోజుల పాటు దద్దరిల్లేలా వేడుకలు..

Telangana Formation Day celebrations: దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబెైంది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తైన వేళ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా  21 రోజుల పాటు రోజుకు వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

Telangana Govt Released The 21 Day Schedule To Celebrate A Decade Of Telangana State Formation From June 2 KRJ
Author
First Published Jun 2, 2023, 6:18 AM IST

Telangana Formation Day celebrations: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి నేటీతో తొమ్మిది వసంతాలు పూర్తయి.. పదో వసంతంలోకి అడుగెడుతోంది. ఈ అపూర్వ సందర్భాన్ని పురస్కరించుకుని యావత్‌ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సిద్దమైంది. ఈ ఉత్సవాల్లో  ఈ తొమిదేళ్ల  ప్రగతి ప్రస్థానాన్ని  చాటేలా ఉత్సవాలు నిర్వహించనున్నది రాష్ట్ర ప్రభుత్వం. నేడు సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దద్దరిల్లేలా ప్రతి రంగానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఆవిర్భావ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 105 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.

తొలి రోజు ఇలా.. ఈ రోజు ఉదయం 10 గంటలా 20 నిముషాలకు అసెంబ్లీ దగ్గర ఉన్న అమరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళి అర్పించనున్నారు. నూతన సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు వేడుకల్లో పాల్గొనాలని ఆదేశించింది ప్రభుత్వం.  

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు బీజేపీ సమాయత్తమౌతోంది. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌ రెడ్డి స్వయంగా వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా గోల్కొండ కోట వేదిక తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించనున్నారు.

ఈ రోజు ఉదయం ( జూన్ 2)ఉదయం 7 గంటల 10 నిముషాలకు జాతీయపతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభిస్తారు. తెలంగాణ సాధన కేవలం ఒక్కరితో సాధ్యం కాలేదనీ, సకల జనుల సమైక్య పోరాటంతో, 1200 మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించదని గుర్తు చేశారు.

మరోవైపు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ప్రజలు ఆదరిస్తున్నారని  కాంగ్రెస్ నేతలు తెలిపారు. తెలంగాణ సాధకురాలు సోనియా గాంధీయేనని, పాలాభిషేకాలకు సిద్ధమౌతున్నారు. పదివేల మందితో హైదరాబాద్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం గాంధీ భవన్ లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ రానున్నారు. 

21 రోజులు దద్దరిలే వేడుకలు

1వ రోజు 'జాతీయ పతాకావిష్కరణ'

2 వ రోజు ‘తెలంగాణ రైతు దినోత్సవం'

3 వ రోజు ‘సురక్షా దినోత్సవం’

4 వ రోజు ‘తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం’

5 వ రోజు‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’

6 వ రోజు ‘సాగునీటి దినోత్సవం’

7 వ రోజు  ‘ఊరూరా చెరువుల పండుగ’

8 వ రోజు ‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’ 

9 వ రోజు ‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’

10 వ రోజు ‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’

11 వ రోజు ‘తెలంగాణ రన్’

12 వ రోజు  ‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’

13 వ రోజు ‘తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం’

14 వ రోజు ‘తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం’

15వ రోజు  ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’

16వ రోజు ‘తెలంగాణ గిరిజనోత్సవం’

17వ రోజు ‘తెలంగాణ మంచి నీళ్ల పండుగ’

18 వ రోజు  ‘తెలంగాణ హరితోత్సవం’

19 వ రోజు ‘తెలంగాణ విద్యాదినోత్సవం’

20 వ రోజు  ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’

21వ రోజు ‘అమరుల సంస్మరణ’ కార్యక్రమం'.

Follow Us:
Download App:
  • android
  • ios