నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం మరో హెచ్చరిక జారీ చేసింది. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తే.. వారికి భారీ జరిమానా తప్పదు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్ పాస్ చేస్తోంది.

నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం మరో హెచ్చరిక జారీ చేసింది. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తే.. వారికి భారీ జరిమానా తప్పదు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్ పాస్ చేస్తోంది.

రోడ్డుపై చెత్త పడేసిన వారికి రూ.500 జరిమానా విధించనున్నారు. సింక్ నుంచి, మురుగు నీటిని రోడ్డుపై వదిలినా.. మంచినీటిని కలుషితం చేసినా కూడా రూ.500 జరిమానా కట్టాల్సిందే. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే రూ.1000, గ్రామ పంచాయతీ స్థలాలను ఆక్రమిస్తే రూ.2000 జరిమానాకు గురవుతారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ చట్టం-2018లో కఠిన నిబంధనలు విధించారు.

 స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ముగిశాక కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం పంచాయతీలన్నీ మురికి కూపాల్లా ఉన్నాయని, వీటిని మార్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నియమితులైన 9500 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని అన్నారు. లేదంటే మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ను రెన్యువల్‌ చేయబోమన్నారు.

ఈ నిబంధనలన్నింటిని ప్రజలు అమలు చేసేలా ఎమ్మెల్యేలు తమ వంతు కర్తవ్యం నిర్వర్తించాలని కేసీఆర్ సూచించారు. రూల్స్ అతిక్రమించిన వారు ఎవరైనా సరే.. శిక్ష మాత్రం తప్పందని ఆయన ఈ సందర్బంగా హెచ్చరించారు.