కోకాపేట్ భూముల వేలం: సర్కార్‌కి రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం, గరిష్ట ధర ఎంతంటే..?
కోర్టు తీర్పు, హైడ్రామా మధ్య ఎట్టకేలకు కోకాపేట భూముల వేలం ముగిసింది. హెచ్ఎండీఏకు చెందిన 49 ఎకరాల్లో 8 ఫ్లాట్లను వేలం వేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నాలుగు ఫ్లాట్లు, ఆ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు మరో నాలుగు ఫ్లాట్ల వేలం జరిగింది.
హైదరాబాద్ కోకాపేట్‌లో జరిగిన భూముల వేలంలో ప్లాట్ల ధర భారీగా పలికింది. ఎకరం గరిష్టంగా రూ.60 కోట్లు పలికింది. కోకాపేటలోని మొత్తం 49 ఎకరాలను హెచ్ఎండీఏ వేలం వేసింది. భూముల వేలం వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం లభించింది. యావరేజ్‌గా ఎకరం ధర రూ.40 కోట్లు పలికింది. గోల్డెన్ మైల్ సైట్‌లోని 2పీ ఫ్లాట్‌లో 1.65 ఎకరాలకు రూ.99.33 కోట్ల బిడ్ వేసింది రాజ్ పుష్ప రియాల్టీ ఎల్ఎల్సీ. ఫ్లాట్ నెంబర్ ఏలోని ఒక ఎకరం భూమి మాత్రం అత్యల్ప ధర పలికింది. దీనిని రూ.31.2 కోట్లకు హైమా డెవలపర్స్ బిడ్ వేసింది.
ఈ- ఆక్షన్‌లో దాదాపు 60 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. హెచ్ఎండీఏ కోకాపేట భూములకు ఎకరాకు రూ.25 కోట్ల అప్సెట్ ధరను ఫిక్స్ చేసింది. మరోవైపు ఎకరాకు రూ.50 కోట్ల ధర వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. హెచ్ఎండీఏకు చెందిన 49 ఎకరాల్లో 8 ఫ్లాట్లను వేలం వేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నాలుగు ఫ్లాట్లు, ఆ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు మరో నాలుగు ఫ్లాట్ల వేలం జరిగింది.
Also Read:ముగిసిన కోకాపేట భూముల వేలం.. ఎకరం రూ. 50 కోట్లు పైమాటే, ప్రభుత్వానికి భారీగా ఆదాయం
అంతకుముందు నిన్న తెలంగాణ బీజేపీ నేత విజయశాంతికి హైకోర్టులో చుక్కెదురైంది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలాన్ని నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూములను వేలం వేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే భూముల వేలాన్ని నిలుపుదల చేయాలంటూ విజయశాంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూముల విక్రయానికి సంబంధించిన జీవో నెం 13ను కొట్టివేయాలని విజయశాంతి పిటిషన్‌లో కోరారు.