ఉచిత టీకా: పూర్తిస్థాయి ఆదేశాలివ్వని టీ సర్కార్, రెండ్రోజుల్లో క్లారిటీ

18 ఏళ్లు పై బడ్డ వారికి ఉచిత టీకాపై రెండ్రోజుల్లో విధాన పరమైన నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ సర్కార్. పూర్తి స్థాయి ఆదేశాలు ఇవ్వకపోవడంతో వ్యాక్సిన్ కోసం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకునే అవకాశం వుంది. అపాయింట్‌మెంట్ తేదీ తర్వాత దీనిని ఖరారు చేయనున్నారు అధికారులు. 

telangana govt key decision on free vaccination ksp

18 ఏళ్లు పై బడ్డ వారికి ఉచిత టీకాపై రెండ్రోజుల్లో విధాన పరమైన నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ సర్కార్. పూర్తి స్థాయి ఆదేశాలు ఇవ్వకపోవడంతో వ్యాక్సిన్ కోసం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకునే అవకాశం వుంది. అపాయింట్‌మెంట్ తేదీ తర్వాత దీనిని ఖరారు చేయనున్నారు అధికారులు. 

కాగా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వయసుతో సంబంధం లేకుండా ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు కోట్ల మందికి రూ.2,500 కోట్ల వ్యయంతో వ్యాక్సినేషన్‌ చేపడుతామని కేసీఆర్‌ వెల్లడించారు.

స్వరాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న వారిని కలుపుకొంటే తెలంగాణలో సుమారు నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారని సీఎం తెలిపారు. వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా టీకా ఇచ్చామని కేసీఆర్ చెప్పారు.

Also Read:కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్: యాంటిజెన్ టెస్ట్‌లో నెగిటివ్, రేపు ఆర్టీపీసీఆర్‌ రిజల్ట్

మిగిలిన వారందరికీ వయసుతో సంబంధం లేకుండా టీకా ఇవ్వాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యంకాదని, అందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వైద్యశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు.

రెండు మూడు రోజుల్లో తనకు వైద్య పరీక్షలు జరిగి, కోలుకున్న తర్వాత సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. 

 

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios