Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం: రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లోనూ దళితబంధు

118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధును అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు కానుంది. ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేల సలహాతో ఈ జాబితాను రూపొందించనున్నారు.

telangana govt key decision on dalitha bandhu
Author
Hyderabad, First Published Jan 22, 2022, 3:22 PM IST

ప్రతిష్టాత్మక దళిత బంధు (dalitha bandhu ) కార్యక్రమంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ (koppula eshwar) , తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ (somesh kumar) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వారు శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధును అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు కానుంది. ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేల సలహాతో ఈ జాబితాను రూపొందించనున్నారు. బ్యాంక్ లింకుతో సంబంధం లేకుండా 10 లక్షల ఆర్ధిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేస్తారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్‌ను ఎంపిక చేస్తారు. ఇప్పటికే వాసాలమర్రి (vasalamarri) , హుజురాబాద్‌లో (huzurabad) దళిత బంధును అమలు చేశారు.     

Follow Us:
Download App:
  • android
  • ios