తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతున్నట్లు  కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా డీఏ పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతున్నట్లు తెలిపింది. కనీస వేతనం , పెన్షన్‌పై 2.73 శాతం డీఏ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో పెన్షనర్లతో పాటు 7.28 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. జూన్ నెల వేతనంతో పాటు పెంచిన డీఏను చెల్లిస్తామని ప్రభుత్వం తన ఉత్వర్వుల్లో తెలిపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
Scroll to load tweet…