తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది . విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.  

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్‌లతో పాటు ఖమ్మం, నిజామాబాద్ కమీషనర్లను ఈసీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య బాధ్యతలు స్వీకరించారు. 

పోస్టింగ్స్ పొందిన అధికారులు :

  • టీఎస్‌పీఏ జాయింట్ డైరెక్టర్‌గా రంగనాథ్‌
  • టీఎస్‌పీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా రాజేంద్ర ప్రసాద్
  • సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి
  • గ్రే హౌండ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు
  • సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికా పంత్
  • సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్
  • ట్రాఫిక్ డీసీపీగా ఆర్‌.వెంకటేశ్వర్లు
  • పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్