తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు రేపు సెలవుగా ప్రకటిస్తూ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా.. టీఆర్ఎస్ రేపు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అంతకన్నాముందే బీజేపీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఏకంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సిద్ధమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే వేడకల్లో పాల్గొననున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పేరుతో కార్యక్రమాలను నిర్వహించనుంది. వీరందరికీ పోటీగా ఎంఐఎం కూడా పాతబస్తీలో జాతీయ జెండాలు చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది.