Asianet News TeluguAsianet News Telugu

రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లోకి వరద నీరు.. కారణమిదే, ప్రభుత్వం క్లారిటీ

నాణ్యతా ప్రమాణాలతో రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ భవనాన్ని నిర్మించామని అధికారులు తెలిపారు. అయితే ఎక్స్‌పాన్షన్ జాయింట్ పని రిపేరులో వుందని.. అంతకుమించి కలెక్టరేట్ కార్యాలయంలో ఎటువంటి సమస్యలు లేవని అధికారులు వెల్లడించారు.

telangana govt clarifies flood hits in rajanna sircilla collectorate ksp
Author
Sircilla, First Published Jul 22, 2021, 7:15 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంలోకి వరద నీరు పోటెత్తడంతో పాటు భవనంలో లీకేజీలు బయటపడటంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు సిరిసిల్లలోని రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నాణ్యతా ప్రమాణాలతో భవనాన్ని నిర్మించామని అధికారులు తెలిపారు. అయితే ఎక్స్‌పాన్షన్ జాయింట్ పని రిపేరులో వుందని.. అంతకుమించి కలెక్టరేట్ కార్యాలయంలో ఎటువంటి సమస్యలు లేవని అధికారులు వెల్లడించారు.

Also Read:ప్రారంభించి నెలరోజులు కూడా గడవకముందే.... కేటీఆర్ ఇలాకాలోనే ఇదీ నూతన కలెక్టరేట్ పరిస్థితి

అన్ని కార్యాలయాల్లో పనులు, మీటింగులకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల రగుడు ఫిల్టర్ బెడ్ వద్ద నుంచి వచ్చే వాగు ఉదృతిగా వస్తుండటంతో, రగుడు జంక్షన్ నుంచి వచ్చే వాగు నుంచి బురద వస్తుండటంతో నీటి ప్రవాహం ఎక్కువగా వుంది కలెక్టరేట్ గేటు వద్దకు నీరు చేరిందని తెలిపారు. వరద ఉద్దృతి తగ్గగానే ఎలాంటి ఆటంకం వుండదని చెప్పారు. రాబోయే రోజుల్లో కలెక్టరేట్ కార్యాలయం ఆవరణ అవతల కాలువల నిర్మాణం పూర్తయిన తర్వాత ఎటువంటి ఆటంకం వుండదని ప్రకటనలో వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios