ప్రారంభించి నెలరోజులు కూడా గడవకముందే.... కేటీఆర్ ఇలాకాలోనే ఇదీ నూతన కలెక్టరేట్ పరిస్థితి

సిరిసిల్లలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడిన నూతన కలెెక్టర్ కార్యాలయం జలదిగ్భందమయ్యింది. కలెక్టరేట్ చూట్టూ నీరు చేరడంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. 

Siricilla Collectorate inundated with flood water akp

సిరిసిల్ల: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటీవల సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమైన కలెక్టర్ కార్యాలయం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో కలెక్టరేట్ ఏదో వాగులో వున్నట్లు దర్శనమిస్తోంది. చుట్టూ వరద నీరు చేరడంతో కలెక్టరేట్ అధికారులతో పాటు వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Siricilla Collectorate inundated with flood water akp

భారీగా చేరిన వర్షపునీటితో కలెక్టర్ కార్యాలయం ముందున్న గార్డెన్ లో మొక్కలు పాడయ్యాయి. ఇక వాహనాల పార్కింగ్ కోసం ఉపయోగించే కార్యాలయ సెల్లార్ లోకి కూడా నీరు చేరడంతో పార్కింగ్ కు వీలు కాకుండా మారింది.

read more   భద్రాద్రి వద్ద గోదావరి మహోగ్రరూపం... నీట మునిగిన పర్ణశాల, రెడ్ అలర్ట్ జారీ

కలెక్టరేట్ ఆవరణే కాదు భవన నిర్మాణంలోని డొల్లతనం కూడా ఈ వర్షాలతో బయటపడింది. భవనంలోపల అక్కడక్కడ లీకేజీలు కూడా దర్శనమిస్తున్నాయి. మూడో ఫ్లోర్ పైపులను అమర్చిన ప్రాంతంలోంచి నీరు లీకయి భవనంలోకి చేరుకుంటోంది. ఇలాంటి లీకేజీలు కలెక్టరేట్ భవనంలో చాలాచోట్ల దర్శనమిస్తున్నాయి.  

Siricilla Collectorate inundated with flood water akp 

 ఇక సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మూలవాగు పొంగిపొర్లుతోంది. ఈ వాగులోకి చేపలవేటకు వెళ్లిన 10మంది మత్స్యకారులు మధ్యలోనే చిక్కుకున్నారు. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో మధ్యలోనే చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios