తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై రైతులు తమకు నచ్చిన పంట వేసుకోవచ్చని సర్కార్ స్పష్టం చేసింది.

గ్రామాల్లో కూడా పంట కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. పంట కొనుగోలు ద్వారా మొత్తం రూ.7,500 కోట్లు నష్టం రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే రైతులు పంటను ఇష్టమొచ్చిన చోట అమ్ముకోవచ్చని తెలిపింది. కేంద్ర చట్టాలు సైతం రైతులు పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.