Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు: తెలంగాణ అప్రమత్తం, సరిహద్దుల్లో స్క్రీనింగ్

నెమ్మదించిందని అనుకున్న కరోనా వైరస్ దేశంలో మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా కోవిడ్‌కు హాట్‌స్పాట్‌గా వున్న మహారాష్టలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు గాను ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది.

telangana govt alert on corona cases in maharastra ksp
Author
Hyderabad, First Published Feb 24, 2021, 6:47 PM IST

నెమ్మదించిందని అనుకున్న కరోనా వైరస్ దేశంలో మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా కోవిడ్‌కు హాట్‌స్పాట్‌గా వున్న మహారాష్టలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు గాను ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది.

ఈ నేపథ్యంలో పక్కనేవున్న తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి సరిహద్దుల్లో టెస్టులు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.

రెంజల్‌, బోధన్‌, నవీపేట, జుక్కల్‌, మద్నూర్‌, బిచ్కుంద, బోధన్‌ మండలాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. ఈ క్రమంలో బోధన్‌ మండలం సాలుర వద్ద చెక్‌ పోస్టు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది థర్మల్‌ స్కానింగ్‌ చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో దెగ్లూర్‌.. తెలంగాణలోని మద్నూర్‌ మండల కేంద్రానికి కేవలం 5 కి.మీ దూరంలో ఉంది. మద్నూర్‌, బిచ్కుంద, జుక్కల్‌ వాసులు నిత్యం ఏదో ఒక పనిమీద ఇటు వైపు రాకపోకలు సాగిస్తూ వుంటారు.

అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పలు వ్యాపారులు సైతం ముంబయికి వెళ్తుంటారు. బాన్సువాడ, బిచ్కుంద, మద్నూర్‌, పిట్లం, రెంజల్‌, నవీపేట మండలాల్లోని పలు గ్రామాల్లో నిర్వహించే సంతలకు మహారాష్ట్ర నుంచి వ్యాపారులు, రైతులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.

ప్రస్తుతం మహారాష్ట్రకు నిత్యం ఆరు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవికాకుండా వారంలో రెండ్రోజులు నడిచే రైళ్లు మరో నాలుగు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌ స్టేషన్‌కు రైలు వచ్చిన సమయాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉండి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios