వెలింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్ సింగ్‌ను (Group Captain Varun Singh) తెలంగాణ గరవ్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) గురువారం పరామర్శించారు. ఆయన తల్లిదండ్రులను కూడా ఆమె ఒదర్చారు.

తమిళనాడు కునూరు సమీపంలో చోటుచేసుకున్న ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో (Army chopper crash) గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ (Group Captain Varun Singh) ఒకరే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వెలింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రిలో వరుణ్ సింగ్‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే 45 శాతం కాలిన గాయాలు కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే పల్స్ రేటు స్థిరంగా ఉన్నట్టుగా చెప్పాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్ సింగ్‌ను తెలంగాణ గరవ్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) గురువారం పరామర్శించారు. 

గురువారం వెలింగ్టన్ మిలటరీ ఆస్పత్రికి వెళ్లిన గవర్న్ తమిళిసై సౌందరాజన్.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకన్నారు. వరుణ్ సింగ్ తల్లిదండ్రులను కూడా ఆమె ఒదర్చారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. గ్రూప్ కెప్టెప్ వరుణ్ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. ఈ మేరకు తమిళిసై సౌందర్‌రాజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Also read: Bipin Rawat: బిపిన్ రావత్ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై

హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందిన సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్, ఆయ‌న స‌తీమ‌ణి మ‌ధులికా రావ‌త్‌తో పాటు మ‌రో 11 మంది సైనికాధికారుల భౌతికకాయాలకు త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ నివాళి అర్పించారు. సైనిక వీరుల పార్దీవ‌దేహాల ముందు పుష్ప‌గుచ్చం ఉంచి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. దేశానికి విశిష్ట సేవలు అందించిన బిపిన్ రావత్‌కు సెల్యూట్ చేస్తున్నట్టుగా చెప్పారు. జ‌న‌ర‌ల్ రావ‌త్ దేశానికి అత్యున్న‌త సేవ‌లు అందించార‌ని, బాధాత‌ప్త హృద‌యంతో అమ‌ర‌ సైనికులు కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్టుగా ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Scroll to load tweet…

అసలేం జరిగింది..
నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కళాశాలలో సిబ్బంది, శిక్షణలో ఉన్న అధికారులను ఉద్దేశించి జనరల్‌ బిపిన్ రావత్‌ బుధవారం ప్రసంగించాల్సి ఉంది. ఇందుకోసం భార్య మధులిక రావత్, మరికొంతమంది సైనిక ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఢిల్లీ నుంచి బుధవారం ఉదయం తమిళనాడు బయలుదేరారు. బుధవారం ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూరు జిల్లా సూలూర్‌‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి 11:48 గంటలకు భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయలుదేరారు. అయితే మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో హెలికాఫ్టర్ కున్నూరు సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాందలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat), ఆయన భార్య మధులికా రావత్ (Madhulika Rawat) సహా 13 మంది మృతి చెందారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ (group captain varun singh) ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనకు ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.