తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీ వెళ్లారు. ఆమె నేడు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశం కానున్నారు. 

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీ వెళ్లారు. ఆమె నేడు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశం కానున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. గతంలో ఢిల్లీకి వెళ్లిన సమయంలో తమిళిసై.. రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్రానికి నివేదించిన సంగతి తెలిసిందే. అలాగే ఢిల్లీ వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై, టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై కూడా కామెంట్స్ చేశారు. 

అయితే ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హౌస్ అరెస్ట్, ప్రజా సంగ్రామ యాత్ర, రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో పరిస్థితులపై ఆమె కేంద్రానికి ఏమైనా నివేదిక అందజేస్తారా? అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.