తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌కు వెళ్లి ఆమె వ్యాక్సిన్ తీసుకున్నారు. 

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌కు వెళ్లి ఆమె వ్యాక్సిన్ తీసుకున్నారు. Azadi Ka Amrit Mahotsav గుర్తుగా 75 రోజుల పాటు 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు వారికి ఉచిత వ్యాక్సిన్‌లను సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి ఆమె థాంక్స్ చెప్పారు.. టీకాలు ప్రాణాలను కాపాడతాయని అన్నారు. ఈ సందర్భంగా రేపటి భద్రచాలం పర్యటన గురించి తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడారు. ఈ రోజు రాత్రి భద్రాచలం బయలుదేరుతున్నట్టుగా చెప్పారు. 

‘‘నా ప్రజలను కలవడానికి వెళ్తున్నాను’’ అని తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. ఈరోజు ఢిల్లీ వెళ్లాల్సి ఉందని.. అయితే ప్రజల దగ్గరకు వెళ్లేందుకు ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తుకున్నానని చెప్పారు. వరదల వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారిని కలుస్తానని తెలిపారు. సీఎం కూడా వెళ్తున్నారు.. అది ఆయన డ్యూటీ అని అన్నారు. 

ఇక, ఇక, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. ఇందుకోసం తమిళిసై సౌందర్ రాజన్ ఈ రోజు రాత్రి రైలులో బయలుదేరి కొత్తగూడెం చేరుకుంటారు. అక్కడి నుంచి భద్రాచలం వెళ్తారు. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇచ్చే విందులకు హాజరయ్యేందుకు గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే భద్రాచలం వెళ్లాలని నిర్ణయం తీసుకున్నా ఆమె.. తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. 

Scroll to load tweet…

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రేపు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితిని పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటుగా సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర అధికారులు ఈ ఏరియల్ సర్వేలో పాల్గొనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయో సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. సహాయక చర్యలు ఎలా కొసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.