అధికారుల దృష్టికి తీసుకెళ్తా, ఆరోగ్యం జాగ్రత్త: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనపై గవర్నర్ తమిళిసై


బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్దుల ఆందోళనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. మీ ఆరోగ్యాలుజాగ్రత్తగా చూసుకోవాలన్నారు. మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని కూడా ఆమె చెప్పారు. మీ పేరేంట్స్ కలలు, మీ లక్ష్య సాధన కోసం ప్రయత్నించాలన్నారు.

Telangana Governor Tamilisai Soundararajan Responds On Basara IIIT students protest

నిర్మల్:  Nirmal జిల్లాలోని Basara IIIT లో విద్యార్ధుల ఆందోళనపై Telangana  గవర్నర్ Tamilisai Soundararajan స్పందించారు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని గవర్నర్ విద్యార్ధులకు సూచించారు. మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని Governor  చెప్పారు. వర్షంలో కూడా విద్యార్ధులు ఆందోళన చేస్తున్న విషయమై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.

 ఏ లక్ష్యసాధన కోసం ట్రిపుల్ ఐటీలో చేరారో ఆ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని ఆమె విద్యార్ధులకు సూచించారు.  మీ పేరేంట్స్ కలలు, మీ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ఆమె విద్యార్ధులను కోరారు. బుధవారంనాడు అర్ధరాత్రి 12 గంటల వరకు Students ఆందోళన చేశారు. 

వర్షంలో కూడా గొడుగులు పట్టుకొని ఆందోళన చేశారు.  ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో జిల్లా  అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రూ. 12 లక్షలను తక్షణమే విడుదల చేస్తామని కూడా అధికారులు ప్రకటించారు. కానీ తాము చేస్తున్న 12 డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ లేదా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి తమకు కచ్చితమైన హామీని ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు.

alos read:అధికారుల చర్చలు విఫలం:కొనసాగుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి.  ట్రిపుల్ ఐటీ వద్దకు మీడియా వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వైపు విద్యార్ధులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

నిర్మల్ జిల్లా కలెక్టర్  ముషారఫ్ అలీ విద్యార్ధులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే  సీఎం వస్తేనే స్పందిస్తామన్నారు. అనంతరం కొందరు విద్యార్ధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుండి హామీ కావాలని విద్యార్ధులు తేల్చి చెప్పారు. మరో వైపు ఆందోళన చేస్తున్న విద్యార్ధుల్లో కొందరు అస్వస్థతకు గురికాగా వారికి చికిత్స అందించారు.

విద్యార్ధులకు మద్దతుగా వారి పేరేంట్స్, CPM, YCP, ABVP విద్యార్ధి సంఘాలు నిరసన ర్యాలీ చేశాయి. నిరసన ర్యాలీ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్ధుల సమస్యలను పరిష్కరిస్తామని కూడా మంత్రి KTR చెప్పారు.మరో వైపు తెలంగాణ విద్యాశాఖ మంత్రి Sabitha Indra Reddy  కూడా అధికారులతో బుధవారం నాడు సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు తాము చిత్తశుద్దితో కృషి చేస్తామన్నారు. మంత్రుల బృందం బాసర ట్రిపుల్ ఐటీని సందర్శిస్తారని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. విద్యార్ధుల జీవితాలతో రాజకీయాలు చేయవద్దని కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజకీయ పార్టీలను కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios