Asianet News TeluguAsianet News Telugu

ఇబ్రహీంపట్నం ఘటనపై తమిళిసై సీరియస్.. త్వరలో బాధితుల వద్దకు గవర్నర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు . అలాగే బాధిత మహిళలను పరామర్శించనున్నారు గవర్నర్. 
 

telangana governor tamilisai soundararajan reacts on sterilization operations in ibrahimpatnam
Author
First Published Sep 1, 2022, 6:45 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుండాలన్నారు. చికిత్స పొందుతున్న మహిళలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు తమిళిసై. అలాగే బాధిత మహిళలను పరామర్శించనున్నారు గవర్నర్. 

మరోవైపు ఇబ్రహీంపట్నం ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లలో మార్పులు చేసింది. రోజుకు 15 మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది. 

ALso Read:ఇబ్రహీంపట్నం ఘటన.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిపివేత: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ఇకపోతే.. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడి ప్రాక్టీస్ లైసెన్స్ ను రద్దు చేసినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న మహిళలకు  హైద్రాబాద్ నిమ్స్, అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న మహిళలను మంత్రి హరీష్ రావు బుధవారం నాడు పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.  

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిమ్స్ ఆసుపత్రితో పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన చెప్పారు. 30 మంది మహిళలకు చికిత్స అందించడం వల్ల ఇన్‌ఫెక్షన్ తగ్గిందన్నారు. ఒక్కరూ కూడా ఐసీయూలో లేరన్నారు. ఇవాళ కొందరిని, రేపు, ఎల్లుండి మిగిలినవారిని డిశ్చార్జ్ చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.  ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ ను కూడా సస్పెండ్ చేశామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న తర్వాత నలుగురు మహిళలు మృతి చెందడం దురదృష్టకరకరమన్నారు.  ఈ ఘటనలో ఇంకా  ఎవరి పాత్ర ఉందని తేలితే వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన ప్రకటించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios