బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధినుల మృతి: 48గంటల్లో నివేదిక ఇవ్వాలని తమిళిసై ఆదేశం

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధినుల ఆత్మహత్యలపై   48 గంటల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  ఆదేశించారు.

telangana Governor Tamilisai Soundararajan orders To Report On Students death in Basara iit lns


హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధినుల మృతిపై  నివేదిక  ఇవ్వాలని తెలంగాణ  గవర్నర్  తమిళిసై సౌందర రాజన్  నివేదిక  కోరారు. శుక్రవారంనాడు  బాసర ట్రిపుల్ ఐటీ   ఇంచార్జీ వెంకటరమణను  ఈ మేరకు  గవర్నర్ ఆదేశించారు.  48 గంటల్లో  నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఇంచార్జీ వీ'సీ వెంకటరమణను ఆదేశించారు. విద్యార్ధులు  ఆత్మహత్యలు   చేసుకోవద్దని  ఆమె కోరారు.

దురదృష్టకర ఘటనల నివారణకు  చేపట్టిన చర్యలపై  నివేదిక  ఇవ్వాలని గవర్నర్ కోరారు.  బాసర ట్రిపుల్ ఐటీలో  వరుస ఆత్మహత్యాలపై  గవర్నర్ ఆవేదన వ్యక్తం  చేశారు. తక్షణమే జోక్యం  చేసుకోవాలని వైఎస్ చాన్సిలర్ ను  గవర్నర్ సూచించారు.  విద్యార్ధుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి  చేయాలని ఆమె ఆదేశించారు. ఉన్నత విద్యను అభ్యసించి సవాళ్లు ఎదుర్కొనేందుకు  సిద్దం కావాలని ఆమె  కోరారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో మూడు  రోజుల వ్యవధిలో  ఇద్దరు విద్యార్ధినులు మృతి చెందారు. ఈ నెల  13వ తేదీన  బాసర ట్రిపుల్ ఐటీలో   దీపిక అనేక  విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది.  ఈ నెల 15వ తేదీన  తెల్లవారుజామున  లిఖిత అనే విద్యార్ధినిమృతి చెందింది.  బాసర ట్రిపుల్ ఐటీలోని  హస్టల్ భవనం నాలుగో అంతస్థు పై నుండి  కిందపడి   లిఖిత మృతి చెందింది.   

2022 ఆగస్టు 7వ తేదీన   బాసర ట్రిపుల్ ఐటీని   గవర్నర్ తమిళిసై సందర్శించారు. విద్యార్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధుల సమస్యలు  పరిష్కారమౌతాయని హామీ ఇచ్చారు.బాసర ట్రిపుల్ ఐటీని గతంలో  మంత్రులు  సందర్శించిన సమయంలో విద్యార్ధుల సమస్యలను  దశలవారీగా  పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

also readd:తొందరపడొద్దు: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులను కోరిన సబితా

మూడు రోజుల వ్యవధిలో  ఇద్దరు విద్యార్ధినులు మృతి చెందడంతో  బాసర ట్రిపుల్ ఐటీ ముందు  నిన్న  విపక్షపార్టీలు ఆందోళనకు దిగాయి.  బాసర ట్రిపుల్ ఐటీలో  విద్యార్ధులు  ఎందుకు  మరణిస్తున్నారని  ప్రశ్నించారు. అయితే  ఇటీవల కాలంలో  వరుసగా  విద్యార్ధినులు మృతి చెందడం  కలకలం రేపుతుంది.బాసర ట్రిపుల్ ఐటీ లో  దీపిక ఆత్మహత్యపై  విచారణ  కమిటీ ఏర్పాటు చేసింది  ప్రభుత్వం. మరోవైపు  లిఖితమృతిపై  వివరాలు కోరినట్టుగా తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  చెప్పారు. విద్యార్ధులు  ఎవరూ కూడ తొందరపడవద్దని  మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో  విద్యార్ధులు  సుదీర్థకాలం పాటు  పోరాటం  చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చేలా చేసుకున్నారు.   విద్యార్ధుల ఆందోళనకు విపక్షాలు, విద్యార్ధి సంఘాలు  మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే.  విద్యార్ధుల సమస్యలను  ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తుంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios