ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ గవర్నర్ తమిళిపై సౌందర రాజన్ బుధవారం నాడు భేటీ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు, గవర్నర్ కు మధ్య అగాధం పెరిగిన తరుణంలో ప్రధానితో తమిళిసై భేటీ కావడం ప్రాధాన్యత చోటు చేసుకొంది.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి Narendra Modiతో తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan బుధవారం నాడు New Delhiలో భేటీ అయ్యారు. మంగళవారం నాడు రాత్రి తమిళిపై న్యూఢిల్లీకి వచ్చారు. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఆమె ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కూడా కలిసి అవకాశం ఉంది.

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిపై సౌందర రాజన్ కు మధ్య అగాధం పెరిగిపోతుంది. ఈ తరుణంలో ప్రధానితో తమిళిసై భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై కూడా ప్రధానికి తమిళిసై వివరించే అవకాశాలున్నాయి.

గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఈ విషయాలపై తెలంగాణ గవర్నర్ సమయం వచ్చినప్పుడల్లా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. 

హూజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పేరుకు సిపారస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే కౌశిక్ రెడ్డి పేరుతో తెలంగాణ ప్రభుత్వం పంపిన ఫైలును గవర్నర్ తన వద్దే పెట్టుకొంది. కౌశిక్ రెడ్డిపై బీజేపీ సహా ఇతర పార్టీలు కూడా ఫిర్యాదు చేశాయి. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ప్రతిపాదించింది. గవర్నర్ కోటాలో మధుసూధనాచారికి టీఆర్ఎస్ సర్కార్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.

ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కూడా కేసీఆర్ సహా మంత్రులు హాజరు కాలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. అయితే తొలుత బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తనకు సమాచారం అందించిందని , ఆ తర్వాత పొరపాటున ఆ సమాచారం పంపారని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చిందని తమిళిసై ప్రకటించింది. టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించారని టీఆర్ఎస్ సర్కార్ పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. గవర్నర్ ప్రసంగం లేకండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడాన్ని కూడా విపక్షాలు తప్పుబట్టాయి. 

రాజ్ భవన్ లో ఉగాది సంబరాలను గవర్నర్ నిర్వహించారు.ఈ సంబరాలకు కేసీఆర్ కు గవర్నర్ ఆహ్వానం పంపింది. అయితే ఈ సంబరాలకు కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ కూడా హాజరు కాలేదు. సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరైన గవర్నర్ కు మంత్రులు స్వాగతం పలకలేదు.ప్రోటోకాల్ పాటించలేదు. ఈ సందర్భాలను పురస్కరించుకొని ఉగాది సంబరాల సమయంలో తాను ఎవరికీ కూడా తల వంచబోనని తమిళిసై స్పష్టం చేశారు. కేసీఆర్ సహా మంత్రులకు ఆహ్వానం పంపిన విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసింది.