తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతలతో పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించిన వివరాలను గవర్నర్.. ప్రధానికి వివరించారు.

ఈ భేటీ అనంతరం తమిళిసై హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. 

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ఆరా తీసినట్లు తెలుస్తోంది. అందువల్లే ఢిల్లీ నుంచి గవర్నర్ కు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాలతోనే సౌందరరాజన్ ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం.

ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు. అలాగే మరోక ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యయాత్నానికి పాల్పడ్డారు. ప్రజలు గమనించడంతో అతడిని ప్రాణాలతో కాపాడుకోగలిగారు. 

ఆకస్మాత్తుగా తెలంగాణ గవర్నర్ ఢిల్లీబాట పట్టడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ఆరా తీసినట్లు తెలుస్తోంది. అందువల్లే ఢిల్లీ నుంచి గవర్నర్ కు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాలతోనే సౌందరరాజన్ ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం.