రాజ్‌భవన్‌లో ఈ ఆఫీసును ప్రారంభించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్‌భవన్ ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

గురువారం కాంగ్రెస్ ఆందోళనపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాల్లో మంచి అంశాలు ఉన్నాయని గవర్నర్ వెల్లడించారు. విపక్షాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ చట్టాలపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, వ్యవసాయ చట్టాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని తమిళిసై వెల్లడించారు.

కాగా రాహుల్ గాంధీని ఉత్తర్ ప్రదేశ్‌లో పోలీసులు తోసేశారనే ఆరోపణలు రావడం, ఆయన్ను అరెస్టు చేయడం వంటి పరిణామాలతో హైదరాబాద్‌లో కాంగ్రెస్-బీజేపీ మధ్య రగడ చెలరేగిన సంగతి తెలిసిందే.

బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది.

కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్‌పై బీజేపీ నాయకులు దాడి చేశారు