Asianet News TeluguAsianet News Telugu

మహాత్మాగాంధీ జయంతి: బాపుఘాట్‌ లో తమిళిసై, కేసీఆర్ నివాళులు

 మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని హైద్రాబాద్ లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద  సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై  గురువారం నాడు నివాళులర్పించారు.

Telangana Governor Tamilisai, CM KCR pay tributes to Mahatma Gandhi at Bapu Ghat
Author
Hyderabad, First Published Oct 2, 2020, 11:49 AM IST

హైదరాబాద్: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని హైద్రాబాద్ లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద  సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై  గురువారం నాడు నివాళులర్పించారు.కరోనాను పురస్కరించుకొని  బాపు ఘాట్ లోకి వీఐపీలను మాత్రమే సెక్యూరిటీ అధికారులు అనుమతించారు.

కార్పోరేటర్లను మాత్రం బాపుఘాట్ లోకి అనుమతించలేదు. బాపుఘాట్ లోని గాంధీ సమాధి వద్ద సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పలువురు మంత్రులు,పలువురు విఐపీలు గాంధీకి నివాళులర్పించారు.

మహత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని  రాష్ట్రంలోని పలు చోట్ల గాంధీకి నివాళులర్పించారు. సాధారణంగా గాంధీ జయంతిని పురస్కరించుకొని బాపు ఘాట్ లో పెద్ద ఎత్తున ప్రముఖులు నివాళులర్పిస్తారు. అయితే కరోనా నేపథ్యంలో ఇవాళ మాత్రం అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు.వీఐపీలు మినహా ఇతరులను అనుమతి ఇవ్వకలేదు. భౌతిక దూరం పాటిస్తూనే  నివాళులర్పించేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఒక్కొక్కరుగా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios