Asianet News TeluguAsianet News Telugu

ఏపీతో తాడోపేడో:రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌‌పై సుప్రీంకి కేసీఆర్ సర్కార్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది.  ఈ రెండు రాష్ట్రాల మధ్య  వివాదానికి ప్రధాన కారణమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై  కేసీఆర్ సర్కార్  మరో పిటిషన్ వేయనుంది. ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని  తెలంగాణ సర్కార్ భావిస్తోంది.

Telangana Government to file petition on Rayalaseema lift irrigation project lns
Author
Hyderabad, First Published Jul 8, 2021, 11:17 AM IST


హైదరాబాద్:  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.  రెండు రోజుల్లో ఉన్నత న్యాయస్థానంలో  కేసీఆర్ సర్కార్  పిటిషన్ దాఖలు చేయనుంది.  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్  ప్రాజెక్టు ప్రాజెక్టును తెలంాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో  మహబూబ్ నగర్ , ఖమ్మం, నల్గొండ  జిల్లాలు  ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ చెబుతుంది. 

 

also read:జలవివాదం: ప్రధాని మోడీకి జగన్ మరో లేఖ

రాయలసీమలిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది.  అయితే తమ ఆదేశాలను కూడ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తే జైలుకు పంపుతామని గత మాసంలో ఎన్జీటీ ఆదేశించింది.  ఎన్జీటీ ఆదేశాలను  ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదని మూడు రోజుల క్రితం ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ  కేంద్ర మంత్రికి కేసీఆర్ ఫిర్యాదు చేశారు. 

అయితే తాజాగా ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై  రెండు రోజుల్లో  పిటిషన్ దాఖలు చయనుంది.కృష్ణా నదితో పాటు గోదావరి నది జలాలను కూడ పున:పంపిణీ చేయాలని తెలంగాణ కోరుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios