Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ సర్కార్‌కి హైకోర్టు షాక్: 22 ప్రైవేట్ ఆసుపత్రుల కోవిడ్ లైసెన్సుల పునరురద్దరణ

: తెలంగాణ రాష్ట్రంలోని 22 ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులను పునరుద్దరించినట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Telangana government re permits to corona treatment licenses for private hospitals lns
Author
Hyderabad, First Published Jun 9, 2021, 12:20 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 22 ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులను పునరుద్దరించినట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులను పునరుద్దరించారు. ప్రభుత్వం నిర్ణయించిన  ఫీజుల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేశారనే ఫిర్యాదుల ఆధారంగా  వైద్య ఆరోగ్యశాఖ ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స లైసెన్సులను రద్దు చేసింది. 

also read:ప్రైవేట్ ఆసుపత్రుల నుండి అధిక ఫీజులు బాధితులకు రీఫండ్ చేయించాలి: తెలంగాణ హైకోర్టు

వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ  ప్రైవేట్ ఆసుపత్రులు కోర్టును ఆశ్రయించాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా చికిత్స చేసేందుకు వీలుగా లైసెన్సులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం నిర్ధేశించిన  ఫీజుల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల నుండి బాధితులకు డబ్బులను రీ ఫండ్ చేయించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా చికిత్సలకు సంబంధించి కొత్త జీవో జారీ చేయాలని కూడ హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేసిన ఫీజులను రీఫండ్ చేయించేందుకు ఏ రకమైన చర్యలు తీసుకొన్నారో చెప్పాలని కూడ హైకోర్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను ప్రశ్నించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios