Asianet News TeluguAsianet News Telugu

వరంగల్ ఎంజీఎంలో రోగిని కొరికిన ఎలుకలు: బ్లాక్‌లిస్టులోకి శానిటేషన్ సంస్థ

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగి కాళ్లు, చేతులు ఎలుకలు కొరికిన ఘటనపై ప్రభుత్వం వరుసగా  చర్యలు తీసుకొంటుంది. శానిటేషన్ నిర్వహిస్తున్న కాంట్రాక్టు సంస్థను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. 

Telangana Government puts Sanitation contractor into black list
Author
Warangal, First Published Apr 1, 2022, 2:50 PM IST

వరంగల్: వరంగల్ MGM ఆసుపత్రిలో రోగిని  Rats కొరికిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది.  ఈ విషయమై ఒక్కొక్కరిపై చర్యలు తీసుకొంటుంది. గురువారం నాడు సూపరింటెండ్ సహా ఇద్దరు వైద్యులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసింది.  అయితే తాజాగా Sanitation  నిర్వహిస్తున్న కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టింది ప్రభుత్వం.  మరో వైపు ఆర్‌ఐసీయూ ఇంచార్జీ Nagarjuna Reddy  నిర్లక్ష్యంపై కూడా ప్రభుత్వం విచారణ చేస్తుంది.

Warangal  జిల్లాకు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తుడైన Srinivas అనే రోగి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్యం విషమించింది. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్  కాళ్లు, చేతులను ఎలుకలు కొరికాయి. అయితే శ్రీనివాస్ కు చికిత్స నిర్వహించిన వైద్యులు కూడా ఈ విషయమై నిర్లక్ష్యంగానే వ్యవహరించారని రోగి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై  మీడియాలో కథనాలు రావడంతోనే వైద్యలు స్పందించారని చెబుతున్నారు.

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలను పట్టుకొనేందుకు బోన్లను ఏర్పాటు చేశారు.ఈ ఆసుపత్రిలోని ఇతర వార్డుల్లో కూడా బోన్లను ఏర్పాటు చేశారు.  ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే రోగి కాళ్లు , చేతులను ఎలుకలు కొరికిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఎంజీఎం సూపరింటెండ్ పై బదిలీ వేటేసింది.వరంగల్ ఎంజీఎం ఘటనలో సూపరింటెండ్ తో పాటు ఇద్దరు వైద్యులపై తెలంగాణ ప్రబుత్వం గురువారం నాడు సస్పెన్షన్ వేటు వేసింది.  గతంలో సూపరింటెండ్ గా పనిచేసిన చంద్రశేఖర్ ను వరంగల్ ఏంజీఎంకు  బదిలీ చేశారు. 

వరంగల్ ఏంజీఎం ఆసుపత్రిలో  శానిటేషన్ పై కొత్త సూపరింటెండ్ కేంద్రీకరించారు. ఐసీయూ సహా ఆసుపత్రిలో ఉన్న ఎలుకల కోసం బోన్లు ఏర్పాటు చేశారు.  ఐసీయూ లో చికిత్స పొందుతున్న కిడ్నీ రోగి శ్రీనివాస్ కు వైద్యుల బృందం చికిత్స అందిస్తుంది. శ్రీనివాస్ ను మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కు తరలించనున్నారు.

వరంగల్ ఏంజీఎం ఆసుపత్రిని ఇవాళ డీఎంఈ సందర్వించనున్నారు.  అయితే ఎలుకల ఘటనపై సూపరింటెండ్ ను బదిలీ చేయడంపై కొందరు వైద్యులు, సిబ్బంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. డీఎంఈ వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేయాలని భావిస్తున్నారు.

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగి శ్రీనివాస్ ను ఎలుకలు కొరికిన ఘటనపై వైద్యులు, సిబ్బంది కూడా పట్టించుకోకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వైద్యులతో పాటు కింది స్థాయి సిబ్బంది కూడా నిర్లక్ష్యం ఈ ఘటనలో కన్పిస్తుందని రోగి బంధువులు విమర్శిస్తున్నారు. ఎలుకలు కొరికి గాయాలైన చోట కనీసం చికిత్స చేయకపోవడంపై కూడా రోగి బంధువుల  మండి పడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios