వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. 

 

ఆధార్ తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని హైకోర్టు గురువారం నాడు ఆదేశించిన విషయం తెలిసిందే.వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత పద్దతిలోనే కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తున్నామని చెబుతూ ధరణిలోనే నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

also read:ఆధార్ వివరాలు అడగొద్దు: రిజిస్ట్రేషన్లపై కేసీఆర్ సర్కార్‌కి హైకోర్టు కీలక ఆదేశాలు

సాంకేతిక సమస్యలు కూడ రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఆధార్ వివరాలను, కుటుంబసభ్యుల వివరాలను రిజిస్ట్రేషన్  సమయంలో వివరాలు అడగకూడదని హైకోర్టు కోరింది. ఆధార్ వివరాల ఆప్షన్లను సాఫ్ట్‌వేర్ నుండి తొలగించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు స్లాట్ బుకింగ్ ను నిలిపివేయాలని ఆదేశించింది.

ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేయనుంది. ధరణి పోర్టల్ పై దాఖలైన పిటిషన్లపై కూడ తెలంగాణ హైకోర్టులో విచారణ చేయనుంది.