ప్రత్యక్ష తరగతులకే తెలంగాణ సర్కార్ మొగ్గు: జూలై 1 నుండి విద్యాసంస్థల ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో జూలై 1వ తేదీ విద్యా సంస్థలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. డిగ్రీ ఆపై స్థాయి విద్యార్థులకు ప్రత్యక్షంగానే క్లాసులు నిర్వహించేందుకే తెలంగాణ సర్కార్ మొగ్గు చూపుతోంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జూలై 1వ తేదీ విద్యా సంస్థలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. డిగ్రీ ఆపై స్థాయి విద్యార్థులకు ప్రత్యక్షంగానే క్లాసులు నిర్వహించేందుకే తెలంగాణ సర్కార్ మొగ్గు చూపుతోంది. రెండు రోజుల క్రితం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో జూలై 1వ తేదీ నుండి విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నారు.
అయితే డిగ్రీ నుండి ఆ పై స్థాయి విద్యార్థులు ప్రత్యక్షంగానే తరగతులు నిర్వహిచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ విద్యార్థులకు ప్రత్యక్షంగా క్లాసులు నిర్వహించాలా ఆన్‌లైన్ లో క్లాసులు నిర్వహించాలా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి 24 నుండి విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 1 వతేదీన విద్యాసంస్థలను ప్రారంభించింది. కరోనా కేసులు పెరిగిపోవడంతో విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. తెలంగాణలో కరోనా కేసుల నేపథ్యంలో ఈ ఏడాది మే 12 నుండి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేశారు. ఈ నెల 20 నుండి లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.