రాష్ట్రంలోని 1 నుండి 9వ తరగతి విద్యార్ధులను ప్రమోట్ చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 

హైదరాబాద్: రాష్ట్రంలోని 1 నుండి 9వ తరగతి విద్యార్ధులను ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 24వ తేదీ నుండి రాష్ట్రంలో విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను ప్రమోట్ చేశారు. ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు ఇంకా పరీక్షలను నిర్వహించే విషయమై ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.

also read:ఏప్రిల్ 27 నుండి తెలంగాణలో వేసవి సెలవులు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలో 1వతరగతి నుండి 9వతరగతులకు చెందిన 53.79 లక్షల మంది విద్యార్ధులు ఉంటారు.పాఠశాలలు, జూనియర్ కాలేజీలు తెరిచే విషయమై జూన్ 1న ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుంది.గత ఏడాది కూడ కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా విద్యార్ధులకు మార్కులను కేటాయించిన విషయం తెలిసిందే.