తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు ప్రభుత్వం కూడా వివరణను రాజ్‌భవన్‌కు పంపింది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీసీ విలీనం బిల్లు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి అనేక ట్విస్టులు చోటుచేసుకుంటాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు ప్రభుత్వం కూడా వివరణను రాజ్‌భవన్‌కు పంపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలకు ప్రభుత్వం ఈ వివరణలో సమాధానం ఇచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
టీఎస్‌ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం ఉన్న రూపంలోనే కొనసాగుతుందని తెలిపింది. కేంద్ర గ్రాంట్లు, వాటా, రుణాల వివరాలు అవసరం లేదని పేర్కొంది. కార్పొరేషన్ కొనసాగుతున్నందున్న విభజన చట్టానికి ఇబ్బంది లేదని తెలిపింది. ఉద్యోగుల ప్రయోజనాలకు పూర్తిగా పరిరక్షిస్తామని చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం అని తెలిపింది. ఉద్యోగుల పింఛన్లు, ఇతర అంశాలపై అయోమయం లేదని తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అయ్యాక వారితో చర్చించే నిర్ణయాలు అని స్పష్టం చేసింది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది.
ఇక, ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు, భత్యం, కేడర్, పదోన్నతులకు ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. గవర్నర్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగిందని తెలిపింది. ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.
ఇదిలాఉంటే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును పరిశీలించాల్సి ఉందని, కొంత సమయం కావాలని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఐదు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. 1958 నుండి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్‌లు, వాటాలు, రుణాలు, ఇతర సహాయం గురించి బిల్లు లో ఎలాంటి వివరాలు లేవని అన్నారు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ స్థితి ని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లు లో లేవని పేర్కొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం వారి సమస్యలకు ఇండస్ట్రీయల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా?, వారి ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా, వారికి ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాలలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగుల కు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
