తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్లతో 230 మంది కాంట్రాక్టు లెక్చరర్ ఉద్యోగాలు
తెలంగాణలో 230 మంది నకిలీ సర్టిఫికెట్లతో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు పొందారని ఆర్ధిక శాఖాధికారులు గుర్తించారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు. వరిలో కొందరికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: Fake Certificates తో 230 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను పొందారని తెలంగాణ ఆర్ధిక శాఖ గుర్తించింది. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కోసం కొందరు నకిలీ సర్టిఫికెట్లను సమర్పించినట్టుగా ఆర్ధిక శాఖ అధికారులు గుర్తించారు.
రాష్ట్రంలోని పలు విభాగాల్లో Contract ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారి వివరాలను ప్రభుత్వం సేకరించింది. రాష్ట్రంలో సుమారు 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులుంటారని ప్రభుత్వం అంచానకు వచ్చింది. అయితే ఆయా శాఖల్లోని ఉద్యోగుల వివరాలను ఆయా శాఖాధిపతులు Finance Department శాఖకు సమర్పించారు. ఆయా ఉద్యోగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో కాంట్రాక్టు లెక్చరర్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిలో 230 మంది నకిలీ సర్టిఫికెట్లు పొందారని ఆర్ధిక శాఖాధికారులు గుర్తించారు. 230 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు నకిలీ సర్టిఫికెట్లను సమర్పించారని గుర్తించారు.నకిలీలుగా తేలింది. మరికొందరు మంజూరు లేని పోస్టులలోపనిచేస్తున్నన్నారని అధికారులు గుర్తించారు. మరో వైపు అర్హత లేకున్నా కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లుగా జాయిన్ అయినట్లు బయటపడింది. ఇప్పటి వరకు 18 మంది డిగ్రీ లెక్చర్లు, ఆరుగురు పాలిటెక్నిక్ లెక్చరర్లకు అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు.