ప్రస్తుతం దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. చాలా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వచ్చి చాలా కోళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో.. చికెన్, కోడి గుడ్డు తినడానికి ప్రజలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో చికెన్, గుడ్డు ధరలు పడిపోయాయి. వీటి ధరలు అలా పడిపోగానే.. మటన ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి.

చికెన్ తినేవారంతా దాని స్థానంలో మటన్ తినడం మొదలుపెట్టారు. దీంతో.. డిమాండ్ పెరగడంతో.. మటన్ ధరలు కూడా పెంచేశారు.  ఎంతలా అంటే.. డిమాండ్ ఉంది కదా అని మటన్ దుకాణాదారులు తమకు నచ్చిన ధరల్లో అమ్మడం మొదలుపెట్టారు. దీంతో.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంది.

గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కిలో మటన్ ధర రూ.1200 కి అమ్ముతున్నారు. దీంతో.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. మటన్ ధరను రూ.600 నుంచి రూ.700 లకు ఫిక్స్ చేసేసింది. మటన్ అమ్మకం దారులంతా కచ్చితంగా ఈ ధరనే అమలు చేయాలని.. అంతకంటే ఎక్కువకు అమ్మకూడదని పేర్కొంది.

మటన్‌ ధర కిలో కు 650 - 700 రూపాయలు కాగా వ్యాపారులు ఏకంగా కిలో 900 - 1000 రూపాయల వరకు పెంచేశారు. కొన్ని ప్రాంతాల్లో రూ.1200 దాకా అమ్ముతున్నారు.  ఇక చేపలు ధరలు కూడా భారీగానే పెరిగాయి. అయితే నిబంధనలు పాటించని వ్యాపారులపై చర్యలు తీసుకుందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.ప్రభుత్వం ఫిక్స్ చేసిన ధరకే మటన్ అమ్మకాలు చేపట్టాలని లేదంటే.. చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కాస్త ఎక్కువగా ఉండటంతో.. తెలంగాణ రాష్ట్రంలో చికెన్ అమ్మకాలను నిలిపివేయాలంటూ ప్రభుత్వం.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ  చేశారు. ఇప్పటి వరకు అయితే.. తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు ఏమీ నమోదు కాలేదని వారు చెప్పారు.