నిజాం కాలేజీలో కొత్త హస్టల్ భవనం డిగ్రీ విద్యార్ధులకే ప్రభుత్వం నిర్ణయం

నిజాం  కాలేజీలో కొత్త హస్టల్ ను డిగ్రీ  విద్యార్ధులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈ హస్టల్ భవనం కేటాయింపు విసయమై డిగ్రీ విద్యార్ధులు ఆందోళనచేస్తున్నారు.దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana Government Decides To Allot New Hostel Building to Nizam College Degree Students

హైదరాబాద్:నిజాం కాలేజీలో కొత్త హస్టల్ ను డిగ్రీ విద్యార్ధులకే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కొత్త హస్టల్ ను తమకే  కేటాయించాలని డిగ్రీ విద్యార్ధులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్ధుల ఆందోళనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.గత కొన్ని రోజులుగా నిజాం కాలేజీ విద్యార్ధులు ఆందోళనలు  చేస్తున్నారు.ఈ హస్టల్ ను పీజీ విద్యార్ధులకు కేటాయించాలని ప్రిన్సిపాల్ తీసుకున్న నిర్ణయంపై డిగ్రీ విద్యార్ధులు ఆందోళకు దిగారు. కొత్త హస్టల్ ను డిగ్రీ విద్యార్ధులకే కేటాయించాలని మంత్రి కేటీఆర్  ఆదేశించిన విషయాన్ని డిగ్రీ విద్యార్ధులు ఈసందర్భంగా ప్రస్తావిస్తున్నారు.విద్యార్ధుల ఆందోళనను ట్విట్టర్ వేదికగా కొందరు మంత్రి కేటీఆర్ దృష్టికి  తీసుకెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించాలని కేటీఆర్ మంత్రి సబితాఇంద్రారెడ్డి,నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అయితే ఈ హస్టల్ లోని సీట్లను 50:50 నిష్పత్తిలో పీజీ,డిగ్రీ విద్యార్ధులకు కేటాయించాలని ప్రతిపాదనను కాలేజీ ప్రిన్సిపాల్ తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనను నిజాం కాలేజీకి చెందిన డిగ్రీ  విద్యార్ధులు ఒప్పుకోలేదు.ఆందోళనకు  దిగారు. దీంతో డిగ్రీ కాలేజీ విద్యార్ధులకే కొత్త హస్టల్ భవనాన్నికేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు అధికారులను ప్రభుత్వంఆదేశించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios